కారేపల్లి, జూలై 08 : కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడులో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్(ఆయుష్మాన్ మందిర్)కు బాజుమల్లాయిగూడెం సర్పంచ్ కోరం కోటమ్మ వైద్య పరికరాలను బుధవారం అక్కడి సిబ్బందికి అందజేశారు. ప్రజలకు రక్త పోటు, గ్లూకోజ్ వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు గాను బిపి, షుగర్ పరీక్షలకు సంబంధించిన పరికరాలను వితరణగా ఇచ్చినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి కళ్యాణి, ఏఎన్ఎంలు ముక్తి నాగమణి, ఉష, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.