ఖమ్మం : డిసెంబర్ 7 వ తేదీ కల్లా మెడికల్ కాలేజీ పనులు పూర్తి చెయ్యాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కెఎస్ఎం అవరణలో నిర్మాణం జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. జిల్లా దవాఖానను సందర్శించి పడకల కొసం నిర్మాణం చేసే షెడ్స్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. వర్కర్స్ ను ఎక్కువ మందిని పెట్టుకుని రాత్రి, పగలు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.