
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని టేకులపల్లిలో నూతనంగా నిర్మించిన కేసీఆర్ టవర్స్ లో ఉండే ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్‌లు శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్‌కు వినతి పత్రం అందచేశారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో కలిసిన ప్రజా ప్రతనిధులు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్‌కు వివరించారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ టవర్స్‌ను నిర్మించారని, అందులో 42 బ్లాకులు, 1008 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు పగడాల శ్రీవిధ్య, దాదే అమృతమ్మ, కమర్తపు మురళి, బుర్రి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు ,నాయకులు షౌకత్ అలీ, కమిటీ సభ్యులు సాజీదా రహీం, మధులత, మంజుల పాల్గొన్నారు.