కారేపల్లి, జులై 04 : కారేపల్లి మండల పరిధిలోని బాజుమల్లాయిగూడెం గ్రామానికి చెందిన బసవ రాంబాబు (52) శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాంబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.