కారేపల్లి (కామేపల్లి), సెప్టెంబర్ 12 : ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గార్ల మండలం పాత పోచారానికి చెందిన గాలిన సాయి ప్రకాష్ ఖమ్మం పట్టణంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఖమ్మం నుండి బైక్పై స్వగ్రామం పోచారం వెళ్తుండగా పండితాపురం పెట్రోల్ బంక్ సమీపంలో ఖమ్మం -ఇల్లెందు ప్రధాన రహదారిపై సింగరేణి (కారేపల్లి) మండలం భాగ్యనగర్ తండాకు చెందిన ఉమా మహేష్ బైకుపై ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సాయి ప్రకాష్ కాలు, చేతికి గాయాలయ్యాయి. స్థానికులు 108 సహాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.