భద్రాచలం, జనవరి 17: ఖమ్మంలో బుధవారం జరుగనున్న బీఆర్ఎస్ సభలో పాల్గొనేందుకు, సభ జయప్రదం కోసం ప్రచారం చేసేందుకు మంగళవారం సైకిల్ యాత్రగా బయలుదేరాడు భద్రాచలానికి చెందిన బీఆర్ఎస్ వీరాభిమాని తూతూక ప్రకాశ్. తెలంగాణ ఉద్యమకారుడైన ఈయన సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి నిత్యం ప్రచారం చేస్తుంటాడు.
గత నవంబర్‌లో మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ భద్రాచలం నుంచి సైకిల్ యాత్రగా వెళ్లి అక్కడ టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశాడు. కరోనా సమయంలో జిల్లా అంతటా తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాడు. బీఆర్ఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా సైకిల్‌కు గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు కట్టుకొని యాత్రగా బయలుదేరే ప్రకాశ్.. గ్రామగ్రామానికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఖమ్మం సభకు ఒక రోజు ముందు భద్రాచలం నుంచి సైకిల్‌పై బయలుదేరాడు.