ఖమ్మం రూరల్, డిసెంబర్ 02 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన కూరపాటి వెంకటేశ్వర్లు బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన వ్యాపార కార్యకలాపాల నిమిత్తం గుర్రాలపాడు సమీపంలో ప్రధాన రహదారిపై వస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన ఖమ్మం రూరల్ పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.