పర్ణశాల :వాహన తనిఖీల్లో అనుమానితుడిని దుమ్ముగూడెం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం…మండల పరిధిలోని పర్ణశాల సమీపంలో తనికీలు చేస్తుండగా ఓ వ్యక్తి కంగారుపడుతూ అనుమానాస్పదంగా కనిపించాడు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా… మొదటి ములకనాపల్లికి చెందిన రవ్వా సోమయ్యగా చెప్పి, ఆతర్వాత చాలా కాలం నుంచి మావోయిస్టు పార్టీకి పనిచేస్తున్నానని, గతంలో కేసు ఉండి జైలుకు కూడా వెళ్లివచ్చినట్లు చెప్పడంతో అతన్ని సోదాచేయగా చర్ల శబరి ఏరియా మావోయిస్టు పార్టీ పేరుతో 20 కరపత్రాలు ఉండటంతో అతన్ని దుమ్ముగూడెంకు తరలించి సీఐ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.