Harish Rao | రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో పాలు, నీళ్లు ఏమిటో ప్రజలకు అర్థమైందని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. ఎవర్ని అడిగినా రేవంత్ పాలన ఎలా ఉందో చెబుతున్నారని తెలిపారు. గజ్వేల్ మున్సిపాలిటీలో శనివారం నాడు హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందిరాపార్క్, ఎంపీడీవో చౌరస్తా వద్ద నుంచి రోడ్ షోలో ప్రసంగించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. జానెడు సీసీ రోడ్డు పోయలేదని.. మోరీ కట్టలేదని.. కనీసం ఒక్క రూపాయి పని కూడా గజ్వేల్‌లో చేయలేదని విమర్శించారు. గజ్వేల్ అభివృద్ది చేసిండు అని కేసీఆర్ ను ప్రతిపక్షాలు తిట్టినయి. మరి కేసీఆర్‌ను మనం కడుపులో పెట్టుకోవాలన్నా వద్దా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు గజ్వేల్‌కు ఉత్తరం పోస్టు చేస్తే గద్వాలకు పోయేదని సమైక్యాంధ్రలోని దీనస్థితిని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు గజ్వేల్ అంటే అభివృద్ధిలో జిగేల్ అని అన్నారు. కేసీఆర్ గజ్వేల్ గౌరవం పెంచాడని కొనియాడారు.

Harish Rao1
ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ నాయకులపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రోడ్డు పొక్కల్లో ఇంత డాంబర్ వేసే తెలివి లేని దద్దమ్మలు కాంగ్రెస్ పాలకులని విమర్శించారు. వీళ్లకు గజ్వేల్ లో ఓటు కావాలని తిరుగుతున్నారని మండిపడ్డారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడగొట్టాలని రేవంత్ రెడ్డి కట్టలు కట్టలు పంపాడట అని ఆరోపించారు. ఆ పైసలు మనల్ని కొట్టి కమాయించినవే.. ఎవరు ఎన్నిఇచ్చినా అవే మా పైసలే అనుకొని తీసుకోవాలని సూచించారు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు గుద్ది కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలె అని పిలుపునిచ్చారు.

Harish Rao3