Mallu Battivikramarka PA | మధిర, ఫిబ్రవరి 24 : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు (పీఏ) తక్కెళ్లపల్లి శ్రీనివాస్(52) ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. ఖమ్మం రూరల్ మండలం ఈదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి కలెక్టర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీనివాస్ మరణ వార్త తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి భార్య మల్లు నందిని.. అతని నివాసానికి వచ్చి ఘనంగా నివాళులర్పించారు.
శ్రీనివాస్ ఖమ్మం ICDS డిపార్ట్మెంట్లో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తూ.. గత ఆరు సంవత్సరాలుగా మధిర ఎమ్మెల్యే , డిప్యూటీ సీఎం (ప్రస్తుతం) మల్లు బట్టి విక్రమార్కకు వ్యక్తిగత సహాయకునిగా పనిచేస్తున్నారు. శ్రీనివాస్‌కు భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.
నివాళులర్పించిన వారిలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పలువురు టీఎన్జీవోస్ నాయకులు, జిల్లా అధికారులు జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ ఉద్యోగులు, మధిర నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల నాయకులున్నారు.
Kothagudem | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.. కొత్త అక్రెడిటేషన్ కార్డులపై మీడియా అకాడమీ విఫలం..
Kothagudem | మళ్లీ సర్వే చేయండి.. కులగణనలో మున్నూరుకాపులకు అన్యాయం: కాంపెల్లి కనకేష్ పటేల్