రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్అధికారదాహంతో అభివృద్ధిని మర చి పార్టీ ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్సీ ఎల్ రమణ ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ ప్రగల్భాలు పలికారని, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి అదే పార్టీ నుంచి ప్రజలకు సేవ చేయాలని, కానీ అధికార దాహంతో అభివృద్ధి ముసుగుతో పార్టీ మారారని, వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. బుధవారం సిరిసిల్లలోని పలు వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.