‘నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయండి’
ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా కార్యదర్శి బొడ్డు మధు అన్నారు. ఖమ్మం మండలంలోని పొన్నెకల్ గ్రామంలో సోమవారం డీవైఎఫ్ఐ సభ్యత్వ నమోదు..
– డీవైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి బొడ్డు మధు
ఖమ్మం రూరల్, జూలై 13 : ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా కార్యదర్శి బొడ్డు మధు అన్నారు. ఖమ్మం మండలంలోని పొన్నెకల్ గ్రామంలో సోమవారం డీవైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డు మధు మాట్లాడుతూ… ఎన్నికల సందర్భంగా అధికారంలోకొస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు కనీసం 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయలేదని విమర్శించారు. నిరుద్యోగ సమస్యతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే మూసీ నది ప్రక్షాళన, హైడ్రా, ఫుట్ బాల్ అంటూ ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు.
నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కోరుతూ సీపీఎం, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 15న ఇందిరా పార్కు వద్ద నిర్వహించే నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మహా ధర్నాకు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత, నిరుద్యోగులు పార్టీలకు, సంఘాలకు పార్టీలకు భారీ సంఖ్యలో హాజరై ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు వేల్పుల ప్రవీణ్, సీనియర్ నాయకులు కత్రం ఉపేందర్, డీవైఎఫ్ఐ నాయకులు పాషా, సాగర్, నరేష్, కిరణ్, రాము, శ్రీను, వెంకట్, కిషోర్, రాజేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- Boddu Madhu
- CPM
- DYFI
- khammam news
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

