సత్తుపల్లి, ఫిబ్రవరి 12: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఇఫ్ట్టూ కార్యాలయంలో సోమవారం కార్మిక సదస్సులో వారు మాట్లాడారు. నిమ్మటూరి రామకృష్ణ, రావి శివరామకృష్ణ (ఏఐటీయూసీ), సర్వేశ్వరరావు, విఠల్ (సీఐటీయూ), శరత్, వెంకన్న (ఐఎఫ్టీయూ), రామారావు (టీఎన్టీయూసీ) పాల్గొన్నారు.
పెనుబల్లి, ఫిబ్రవరి 12: గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్‌రావు పిలుపునిచ్చారు. వీ.ఎం.బంజర సెంటర్లో సోమవారం భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో మాట్లాడారు. ముందుగా ర్యాలీ నిర్వహించారు. కార్మిక నాయకులు ఆంబోజు శ్రీనివాసరావు, గాయం తిరుపతిరావు, చీపి వెంకటేశ్వరరావు, వాడపల్లి వెంకటకృష్ణ, భూలక్ష్మి, విమల తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల, ఫిబ్రవరి 12: గ్రామీణ భారత్ బంద్‌ను ప్రజలు జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భూక్యా వీరభద్రం కోరారు. పార్టీ మండల విస్తృత సమావేశం లక్ష్మీపురం గ్రామంలో సోమవారం జరిగిది. వీరభద్రం మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి, కార్మిక సమస్యలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. నాయకులు చింతపల్లి ప్రసాద్, తాళ్లపల్లి కృష్ణ, చెరుకుమల్లి కుటుంబరావు, కొప్పుల కృష్ణయ్య, కట్టా రాంబాబు, తాళ్లపల్లి విజయ తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల, ఫిబ్రవరి 12: దేశవ్యాప్త గ్రామీణ బంద్‌ను ప్రజలు జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు భాగం హేమంతరావు కోరారు. మండలంలోని తనికెళ్లలో సోమవారం రైతులు, కార్మికుల సమావేశంలో మాట్లాడారు. నాయకులు యర్రా బాబు, పీవీ రావు తదితరులు పాల్గొన్నారు.
వైరా టౌన్, ఫిబ్రవరి 12: గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుదూ రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఐసోమవారం వైరాలో బైక్ ర్యాలీ జరిగింది. నాయకులు బొంతు రాంబాబు, కె.అర్జున్‌రావు, కిలారు సురేందర్, యామాల గోపాలరావు, అనుమోలు రామారావు, ఎస్కె.జమాల్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 12: కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తు ఈ నెల 16వ తేదీన జరిగే గ్రామీణ భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఐ (ఎంఎల్ ప్రజాపంథా) నాయకుడు తిమ్మిడి హనుమంతరావు కోరారు. మండలంలోని బచ్చోడులో సోమవారం గ్రామీణ బంద్ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు గుండెపొంగు మల్లేశ్,అంగిరేకుల నర్సయ్య, బింగి రమేశ్, గొర్రెపాటి రవీందర్, అమ్మోజు బ్రహ్మచారి, గొర్రెపాటి రమేశ్, వీరస్వామి పాల్గొన్నారు.