ఇల్లెందు/ మధిర, అక్టోబర్ 25 : అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని, తడిసిన మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, మాస్‌లైన్, ఏఐకేఎంఎస్, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇల్లెందు మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలతో తడిసిన మొక్కజొన్నలను సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, మాస్‌లైన్, ఏఐకేఎంఎస్ నాయకులు శనివారం వేర్వేరుగా సందర్శించి, నిరసన తెలిపారు.
పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్డీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆవునూరి మధు, మాస్‌లైన్ జిల్లా నాయకుడు నాయిని రాజు, ఏఐకేఎంఎస్ మండల నాయకులు మూడ్ మాలు, బానోత్ సంతు, వాంకుడోత్ మోతీలాల్, సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు, మొక్కజొన్నలు వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నాయని, కొన్నిచోట్ల మొలకెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పెసర, వరి, పత్తి పంటలు సైతం దెబ్బతిన్నాయన్నారు. వెంటనే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాచబంటి రాము, వత్సవాయి జానకీరాములు, నాన్నక కృష్ణమూర్తి, కాటబత్తిని వీరబాబు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, మడిపల్లి కిరణ్‌బాబు పాల్గొన్నారు.