అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మక్కజొన్న చేన్లు దగ్ధమైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు రైతులకు చెందిన 15 ఎకరాల మక్కజొన్న పంటలు కాలిబూడిదయ్యాయి.
అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని, తడిసిన మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, మాస్‌లైన్, ఏఐకేఎంఎస్, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇల్లెందు మండలంలో�