వనపర్తి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : అకాల వర్షాలకు అతలాకుతలమవుతున్న రైతులను వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తూ జలగల్లా కష్టాన్ని దోచుకుంటున్నారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ యా ర్డులో మొక్కజొన్న రైతులు అన్యాయానికి గురవుతున్నారు. పది రోజులకు పైగా యా ర్డులో కొనుగోళ్లు సరిగా జరగకపోవడంతో ఇ బ్బందులు పడుతున్నారు. కనీస మద్దతు ధర కరువైంది. సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన మక్కలకు కనీసంగా క్వింటాకు రూ.2వేల ధర దాటడం లేదంటే ప్రైవేట్ వ్యాపారుల దందా ఏ స్థాయిలో నడుస్తున్నదో ఇట్టే అర్థమవుతున్నది. వనపర్తి జిల్లాలో ఈ ఏడాది రైతులు దాదాపు 15వేల ఎకరాలకు పైగా మొక్కజొన్నను సాగుచేశారు. వేరుశనగను పూర్తిగా తగ్గించి మొక్కజొన్నను ఎంచుకున్నారు. దీం తో ఇటీవల చేతికొచ్చిన పంటను సిద్ధం చేసుకొని వనపర్తి మార్కెట్కు తీసుకొస్తే నిరాశే మిగిలింది. మద్దతు ధర లేకపోవడంతో రైతు లు ఆందోళన చెందుతున్నారు.
మార్కెట్ యార్డులో దాదాపు 5వేల క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యం ఉందని రైతులు చెబుతున్నారు. అధికారులు చెప్పేదానికి తేడా ఉం ది. 2వేల క్వింటాళ్లు షెడ్ల కింద ఉంటే, మరో 2వేల క్వింటాళ్లకు పైగా మొక్కజొన్న యా ర్డులో ఉన్నది. నెల రోజుల వ్యవధిలో దాదా పు 15,215 క్వింటాళ్ల మొక్కలను ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు సెంటర్ లేనందునా వ్యా పారుల ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిత్యకృత్యంగా వర్షాలున్నా రైతులు అనేక కష్టాలకోర్చి పంటను సిద్ధం చేసుకున్నారు. తీరా యార్డుకు వచ్చేసరికి ఆశించిన ధరల్లేక చెతికిలపడుతున్నారు.
ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ. 2,400లుగా మద్దతు ధరను నిర్ణయించింది. అయితే, వనపర్తి మార్కెట్ యార్డులో ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క క్వింటాకు కూడా మద్దతు ధరకు నోచుకోలేదు. అందినకాడికి అన్నట్లు వ్యాపారులు మొక్కలు కొంటున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నెల రోజులకు పైగా కొనుగోలు జరుగుతున్నా ఒక్క రోజు కూడా కనీస మద్దతు ధర రాకపోవడం విచారకరం. శనివారం మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసిన వివరాలను పరిశీలిస్తే.. కేవలం 136 క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. ఇందులో అ త్యధిక ధర రూ.1,500లు కాగా, తక్కువ ధర రూ.1,350లుగా బేరం సాగింది. ఈ ధరల ను చూసి రైతుల కండ్లు బైర్లు కమ్మాయి.
వారం రోజులుగా మార్కెట్ యార్డులోనే ఉన్నా. మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. దాదాపు 50 క్వింటాళ్లకు పైగా మొక్కజొన్న వచ్చింది. రెండు, మూడు రోజులుగా క్వింటాకు రూ.1,500కు అడుగు తున్నారు. ఇంకా తక్కువ ధరకు కొనాలని చూస్తున్నారు. సర్కారోళ్లు పట్టించుకుంటలేరు. వ్యాపారులు వాళ్లకు ఇష్టమొచ్చు రేట్లు చెబుతున్నరు.
– శంకర్, రైతు, తల్పునూరు, రేవల్లి మండలం
వారం రోజుల నుంచి మార్కెట్లో మగ్గుతున్నాం. ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. తక్కువ ధరలకు అడుగుతున్నరు. ఎప్పుడూ ఇంత తక్కువకు అడగలేదు. ప్రభుత్వం మా బాధలు పట్టించుకుంటలేదు. వ్యాపారులు అందిన కాడిని మా కష్టాన్ని దోచుకుంటుండ్రు. మద్దతు ధర ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి.
– జయమ్మ, ధర్మతండా, బుద్ధారం, గోపాల్పేట మండలం