Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Mallu Bhatti Vikramarka | అర్హులైన మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదు అంటూ మహిళలు భట్టి విక్రమార్కను నిలదీశారు. అర్హులైన తమకు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డౌన్ డౌన్ భట్టి అంటూ మహిళలు, బాధితులు నినాదాలు చేశారు.
Mallu Bhatti Vikramarka | అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సొంత ఇలాఖాలో చేదు అనుభవం ఎదురైంది. ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు చేసేందుకు భట్టి విక్రమార్క వెళ్లారు.
అయితే కొందరు మహిళలు అర్హులైన మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదు అంటూ భట్టి విక్రమార్కను నిలదీశారు. గ్రామంలో 15 ఎకరాల భూమి, రెండంతస్తుల బిల్డింగులు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారు.. కానీ అర్హులైన తమకు ఇవ్వడం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డౌన్ డౌన్ భట్టి అంటూ మహిళలు, బాధితులు నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట రౌండప్ చేస్తోంది. రేవంత్ సర్కార్లో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ఎంత పారదర్శకంగా జరుగుతుందో తాజా వీడియో మరోసారి చెప్పకనే చెబుతోంది.
ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన మాకు రాలేదు డౌన్ డౌన్ భట్టి అంటూ ఎదురుతిరిగిన మహిళలు
మధిర మండలం దెందుకూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించేందుకు వెళ్లిన భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు
గ్రామంలో 15 ఎకరాల భూమి, రెండంతస్తుల బిల్డింగులు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారని, అర్హులైన తమకు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2026
Read Also :
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

