Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Officials Negligence | ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భవిష్యత్తు అవసరాల కోసం ఆదా చేయాలని ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచేలా మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది.
మాగనూరు : ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భవిష్యత్తు అవసరాల కోసం ఆదా చేయాలని ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచేలా మిషన్ భగీరథ (Mission Bhagiratha) అధికారుల నిర్లక్ష్యం ( Officials Negligence) కనిపిస్తోంది.
మాగనూరు మండల కేంద్రంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ పగిలి మూడు రోజులైనా సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో విలువైన తాగునీరు వృథాగా ( Wastage ) పారుతూ చెరువును తలపిస్తోంది. పైప్లైన్ నుంచి బయటకు వస్తున్న నీరు పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున నిలిచిపోవడంతో నీటి వనరులు వృథా కావడమే కాకుండా పరిసర ప్రాంతాలు చిత్తడిగా మారుతున్నాయి.

ఒకవైపు మాగనూరు కృష్ణ మండల పరిధిలోని ఎనిమిది గ్రామాల ప్రజలు మిషన్ భగీరథ ద్వారా సక్రమంగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పైప్లైన్ పగిలి నీరు వృథాగా పోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా నీరు వృథాగా పారుతున్నా అధికారులు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోంది.
ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాల నే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా పథకం లక్ష్యం నీరుగారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాగనూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారి పక్కన ప్రజలకు తాగునీరు అందించాల్సిన పైప్లైన్ల నుంచే నీరు వృథాగా ప్రవహిస్తుంది. నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పే ప్రభుత్వ యంత్రాంగం ముందుగా తన శాఖల పరిధిలో జరుగుతున్న నీటి వృథాను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

