కారేపల్లి, జూలై 14 : ప్రయాణికులను దింపేందుకు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులతో పాటు ఆర్టీసీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం వైపు నుండి ఇల్లెందు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కామేపల్లి స్టేజీలో ప్రయాణికులను దింపేందుకు ఆగింది. దీంతో వెనుక నుండి వేగంగా వస్తున్న యాష్ లారీ అదుపుతప్పి ముందున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ అంజితో పాటు ప్రయాణికులు రమాదేవి, శ్రీవిద్య భూక్యశౌర్య, సీతకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రమాద స్థలానికి చేరుకున్న కామేపల్లి, కారేపల్లి పోలీసులు క్షతగాత్రులను 108 సహాయంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ బి.ఉపేందర్ తెలిపారు. లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Karepalli : ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు