కారేపల్లి, జూన్ 17 : ఎదురెదురుగా వస్తున్న మోటార్ సైకిల్, లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామేపల్లి మండల పరిధిలోని అడవి మద్దులపల్లికి చెందిన దుగ్గి సూర్యనారాయణ (56) పని మీద బైక్పై కారేపల్లి మండలం గాంధీనగరంకు వెళ్లి ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో ఇల్లెందు ఖమ్మం ప్రధాన రహదారిపై ఊట్కూర్ బస్ స్టేజి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ట్యాంకర్ లారీ సూర్యనారాయణ ప్రయాణిస్తున్న బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.