తిరుమలాయపాలెం, మే 12 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని మేకలతండా వద్ద ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఓ లారీలో బొగ్గు లోడు ఉండడంతో మంటలు చెలరేగి ఓ లారీ డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి సజీవ దహనం అయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.