మధిర ఏప్రిల్ 23 : ఓరుగల్లు సభకు ప్రజలంతా వెల్లువలా కదలి రావాలని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ అన్నారు. బుధవారం మధిర మండలంలోని రాయపట్నం గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 27వ తారీకు వరంగల్ ఎలకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రజతోత్సవ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలన్నారు. ఈ బహిరంగ సభతో కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు పుట్టాలన్నారు.
ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అప్పులు తెచ్చి కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లు బిల్లు చెల్లిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. రాబోయేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు, రైతు నాయకులు చావా వేణు బాబు, రాయపట్నం నాయకులు మాజీ సర్పంచ్ తీమోతి, గోపి తదితరులు పాల్గొన్నారు.