సభ్యత్వ నమోదే పార్టీకి బలమైన పునాది
బూత్ స్థాయిలో ప్రతీ కార్యకర్త ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించాలని, అదే పార్టీకి బలమైన పునాది అని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. రామకృష్ణాపురంలో ఎస్ఐఆర్తోపాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.
- బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, సర్పై అవగాహన సదస్సులో జడ్పీ మాజీ చైర్మన్ కమల్ రాజు
చింతకాని, జూన్ 25: బూత్ స్థాయిలో ప్రతీ కార్యకర్త ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించాలని, అదే పార్టీకి బలమైన పునాది అని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. రామకృష్ణాపురంలో ఎస్ఐఆర్తోపాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని కార్యకర్తలకు సూచించారు.
జిల్లాలోనే అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసి మధిర నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతీ ఓటును జాగ్రత్తగా పరిశీలిస్తూ.. అర్హులైన వారి పేర్ల నమోదు, జాబితాలో వివరాల సవరణ, తప్పుల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం బూత్ స్థాయి నాయకులు పార్టీ శ్రేణులకు దీనిపై అవగాహన కల్పిస్తూ దిశానిర్దేశం చేశారు. నాయకులు మంకెన రమేశ్, బొడ్డు వెంకటరామారావు, గురజాల హనుమంతరావు, వంకాయలపాటి లచ్చయ్య, దమ్మాలపాటి వెంకటేశ్వరావు, పొనుగోటి రత్నాకర్, రవీందర్రెడ్డి, పిన్నెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

