రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ)/ వీర్నపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పర్యటించనున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్ల్లి, గర్జనపల్లి క్లస్టర్ పరిధిలో ఇటీవల మూడు రోజుల పాటు నిర్వహించిన కేసీఆర్ కంటి వెలుగు శిబిరాల్లో 2042 మంది పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే కంటి సమస్యలున్న 1340 మందికి కండ్లద్దాలను పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుండగా, కేటీఆర్ హాజరై అందజేయనున్నారు. తర్వాత రాజన్నపేటలో మాజీ ఎంపీటీసీ నందికొండ శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం సిరిసిల్ల పట్టణానికి చేరుకోని ఇటీవల హాత్యకు గురైన నేత కార్మికుడు వెంగ ల వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
వీర్నపల్లిలో కండ్లద్దాల పంపిణీ సందర్భంగా నిర్వహించే సభ ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పరిశీలించారు. కండ్లద్దాలు అవసరమైన వారికి సమాచారం అందించాలని ఆయా గ్రామాల నాయకులకు సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు చాంద్ పాషా, బంజార సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ సురేష్ నాయక్, నేతలు బోయిని రవి, శ్రీరాంనాయక్, అరుణ్, మహిపాల్ పాల్గొన్నారు.