మధిర, ఏప్రిల్ 20 : బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. ఆదివారం మధిర మండలం మాటూరు గ్రామంలోని కేసీఆర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెండాను విష్కరించారు.
ఈ సందర్భంగా చిన్నారులు, కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. కమల్‌రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పదేండ్లపాటు పరిపాలన చేసి కేసీఆర్ ప్రజలకు అండగా నిలిచారన్నారు. 18నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రాబోయేది మళ్లీ కేసీఆర్ పాలనే అని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఈ నెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజోత్సవ సభలో అధికసంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్‌రెడ్డి, నాయకులు వంకాయలపాటి నాగేశ్వరరావు, ఆళ్ల నాగబాబు, మాజీ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, నాగేశ్వరరావు, పల్లపాటి కోటేశ్వరరావు, కూటం కోటేశ్వరరావు, వెంకయ్య, యూత్ నాయకులు కోటేశ్వరరావు, అశోక్, మాజీ కౌన్సిలర్ యన్నంశెట్టి అప్పారావు, పరిశా శ్రీనివాసరావు పాల్గొన్నారు.