చింతకాని: దళితబంధుతో దళితుల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని, దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. మండల పరిధిలో జగన్నాథపురంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ చింతకాని మండల స్ధాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో ప్రత్యేక అతిధిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ముందుగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 14ఏండ్ల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ది అజెండాలుగా ముందుకెళ్తున్న తరుణంలో దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడమే కాకుండా ఆచరణలో అమలు చేస్తున్నారని తెలిపారు.
ఉమ్మడి పాలనలో దళితుల కోసం ఎన్నో పథకాలు వచ్చినా అవి దళితుల జీవితాల్లో మార్పులు తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యాయని, సీఎం కేసీఆర్ ఏది చేసినా భవిష్యత్ తరాల కోసం, జాతి సమున్నతి కోసం మందుచూపుతో ఆలోచించి పథకాలు రూపోందిస్తారని, దళితబంధు ద్వారా దళితుల జీవితాల్లో పెనుమార్పులు తధ్యమని పేర్కొన్నారు. తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన 20కుటుంబాల వారు పలు పార్టీల నుంచి జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, కార్యదర్శి బోడ్డు వెంకట్రామారావు, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతికిశోర్, సోసైటీ చైర్మన్లు కోండపల్లి శేఖర్‌రెడ్డి, నల్లమోతు శేషగిరిరావు, నాయకులు కిలారు మనోహర్, వంకాయలపాటి సత్యనారాయణ, నూతలపాటి వెంకటేశ్వర్లు, ఆలస్యం నాగయ్య, బండి సుభద్ర, పర్చగాని లక్ష్మణ్, కోలేటి సూర్యప్రకాశ్, రాధాకృష్ణ, నారపోగు నాగయ్య, పిన్నెల్లి శ్రీను, ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.