మధిర, సెప్టెంబర్ 8: జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అంటూ యువతను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటినీ విస్మరించిందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల్ కమల్‌రాజు ఆరోపించారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో యువజన, విద్యార్థి సంఘం సోషల్ మీడియా వారియర్స్‌తో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని, అధికారం దక్కించుకోవడానికి నోటికొచ్చిన వాగ్దానాలు గుప్పించి.. ఇప్పుడు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాలయపన చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, బీఆర్ఎస్ పార్టీనే ఈ రాష్ర్టానికి శ్రీరామరక్షగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిందన్నారు.
ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తామని, చదువుకుంటున్న యువతులకు స్కూ టీలు ఇస్తామని హామీలు ఇచ్చి విస్మరించిందందన్నారు. సమావేశంలో మార్కెట్ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, నాయకులు చావా వేణు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, వైవీ అప్పారావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, కోన నరేందర్‌రెడ్డి, బొగ్గుల వీరారెడ్డి, బుర్రి బాబురావు, పల్లపాటి కోటేశ్వరరావు, అయిలూరి ఉమామహేశ్వరరెడ్డి, సర్వేశ్, దిల్లు, పరిశ శ్రీనివాసరావు, ఆళ్ల నాగబాబు, కందుకూరి నాగబాబు, చీదిరాల రాంబాబు, అబ్దుల్ ఖురేషి పాల్గొన్నారు.