యైటింక్లయిన్ కాలనీ జూన్ 15: రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్‌ను గెలిపించి, రుణం తీర్చుకుందామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింగరేణి కార్మికులకు పిలుపుచ్చా రు. ఆర్జీ-2 ఏరియాలోని వకీలుపల్లి గనిలో నిర్వహించిన గేట్ మీటింగులో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. ముం దుగా కార్మికులను నేరుగా కలిసి సమస్యలు అడిగి తెలుసు కున్నారు. టీబీజీకేఎస్‌లో 30 మంది యువ ఉద్యోగులు చేరగా, వారికి యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరు కోట్ల ప్రజల ఆకాంక్షను ముందుండి సీఎం కేసీఆర్ నెరవేర్చాని గుర్తు చేశారు. సీఎంగా మరోసారి గెలిపించే వరకు కార్మిక వర్గం నిద్ర పోవద్దని పిలుపునిచ్చారు.
సమైక్య రాష్ట్రంలో ఎంత గోస పడ్డమో ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో తాగు, సాగు నీరందించాలనే ఏకైక లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి అపరభగీరథుడుగా పే రు తెచ్చుకున్నాడని కొనియాడారు. ఇంటింటికీ సంక్షేమ పథకా లు అందిస్తూ, సబ్బండ వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఐటీ రంగంలో 15 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి యువతకు అండగా వుంటున్నాడని తెలిపారు. కేసీఆర్ పాలనలో సింగరేణికి పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. దానికి నిదర్శనమే కారుణ్య రూపంలో వారసత్వ ఉద్యోగాల అ మలు అని గుర్తు చేశారు. ఎన్నో హక్కులను సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఉ పాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, మల్లికార్జున్, చెరుకు ప్రభాకర్ రెడ్డి, దశరథం గౌడ్, బాపురావు, ఐ. సత్యం, మేడి సదయ్య, వంశీ, ఎల్కలపల్లి సదయ్య, బేతి చంద్రయ్య, గూడెల్లి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిటీ హాల్‌కు భూమి పూజ
ఆర్జీ-2 ఏరియాలోని మహాకవి పోతన కాలనీ కార్మిక కుటుంబాల సముదాయంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎ మ్మెల్యే కోరుకంటి చందర్ గురువారం భూమి పూజ చేశారు. ఏరియా జీఎం ఐత మనోహర్, మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్‌తో కలిసి భూమి పూజ చేసి మాట్లాడారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నామని గుర్తు చేశారు. గతంలో కాలనీ నుం చి పోతన కాలనీకి రావాలంటే జల్లారం వాగు అడ్డంకిగా ఉండేదని గుర్తు చేశారు. ఆ సమస్యను గుర్తించి యాజమాన్యంతో మాట్లాడి బ్రిడ్జి నిర్మించినట్లు తెలిపారు. కార్పొరేటర్ తాళ్ల అమృతరాజయ్య, డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, డీజీఎం(సి) ధనుంజయ్, డీజీఎం(ప) జీ. రాజేంద్రప్రసాద్, కార్మిక నాయకులు ఐ. సత్యం, ప్రభాకర్‌రెడ్డి, తాళ్ల రాజయ్య, బండ రమేశ్‌రెడ్డి, కుమార్‌నాయక్, మేడి సదయ్య, దశరథమ్గౌడ్ ఉన్నారు.