TUCI | కారేపల్లి, ఫిబ్రవరి 9 : ఈనెల 16వ తేదీన కారేపల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) మండలం ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కే. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన ప్రచార కరపత్రాన్ని మండల పరిధిలోని టేకులగూడెం గ్రామంలో ఇవాళ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సమూలంగా మార్చేసి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలున్నవి, కార్మిక హక్కులున్నవి పాలకుల ప్రభుత్వాలు ఇచ్చినవి కావని గుర్తుకు చేశారు.
దశాబ్ధాల కాలంపాటు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న చరిత్ర కార్మిక వర్గాలదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎంతో లాభాన్ని తీసుకొస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ సంస్థ ప్రైవేట్‌కు వ్యతిరేకంగా.. ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల జీతాల పెంపునకు టీయూసీఐ అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు.
అదేవిధంగా గ్రామాలలో ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ పరిశుభ్రతకు దోహదబడుతున్న పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి, స్కిన్ అన్ స్కిల్ అని విధానాన్ని రద్దు చేయాలని పోరాటం చేయడం జరిగిందన్నారు. తొలిసారిగా నిర్వహిస్తున్న టీయూసీఐ ప్రధమ మహాసభకు కార్మికులంతా భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ధరావత్ సక్రు నాయక్, జోగ నాగేశ్వరరావు, భూక్యా రమేష్, బండారు కోటేశ్వరరావు, కేలోతు రాజు తదితరులు పాల్గొన్నారు.
Manchireddy Kishan Reddy | దమ్ముంటే రైతులకు ఫార్మాసిటీ భూములిప్పించండి : మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రచ్చబండపై నిరాహారదీక్షకు దిగిన యువకుడు