పెనుబల్లి, ఏప్రిల్ 13: కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. పెనుబల్లి మండలం ముత్తగూడెంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు అధ్యక్షతన ఆదివారం జరిగిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పండుగలా నిర్వహించబోతున్నామని అన్నారు. ఈ సభలో సత్తుపల్లి నియోజకవర్గ సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.
రజతోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేది కేసీఆర్, కేటీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. అనంతరం రజతోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశానికి ముందుగా ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నాయకులు కనగాల వెంకట్రావు, చెక్కిలాల మోహన్‌రావు, లక్కినేని అలేఖ్య, వినీల్, చెక్కిలాల లక్ష్మణరావు, నాగిరెడ్డి, తిరుమలరెడ్డి, నాగదాసు, కోటగిరి సుధాకర్, బాబు, తడికమల్ల శేఖర్, బండారుపల్లి నాగేశ్వరరావు, నరుకుళ్ల సత్యనారాయణ, రాధాకృష్ణ, తన్నీరు కృష్ణ, కొత్తగుండ్ల అప్పారావు, సీతారాములు, రాయపూడి మల్లయ్య, సూరపురెడ్డి కిరణ్‌రెడ్డి, ఏటుకూరి వెంకట అప్పారావు, తుమ్మలపల్లి రమేశ్, పోతురాజు కృష్ణారావు, బెల్లంకొండ చలపతిరావు, లగడపాటి శ్రీనివాసరావు, తావునాయక్, చిలుకూరు వెంకటరామారావు, గాయం వెంకటేశ్వరరావు, తెలగొర్ల జనార్దన్, కోట ప్రభాకర్, వాంకుడోతు మురళి, పర్సా వెంకటనారాయణ, పసుమర్తి వెంకటేశ్వరరావు, వంగా చంద్రశేఖర్, మరకాల చంటి, మరకాల వెంకీ తదితరులు పాల్గొన్నారు.