కారేపల్లి (కామేపల్లి)/ టేకులపల్లి, అక్టోబర్ 9: ఇల్లెందు నియోజకవర్గ గెలుపును సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పిలుపునిచ్చారు. ఈ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, వాటిని గమనించి మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. కామేపల్లి మండలంలో సోమవారం పర్యటించిన ఆమె.. పొన్నెకల్లు, బర్లగూడెం, రుక్కితండా, గోవింద్రాల, కొత్త లింగాల, జోగ్గూడెం చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. జోగ్గూడెం నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఆయా కార్యక్రమాల్లో ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు నిర్మించామని అన్నారు. ఊట్కూరులో తాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు తెలియజేయడంతో రూ.35 లక్షలతో పైపులైన్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. తొలుత జోగ్గూడెం పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు గృహలక్ష్మి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. పజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, సునీత, విజయభాస్కర్‌రెడ్డి, జీవీఎస్, హన్మంతరావు, భగవాన్, సులోచన, లక్ష్మణ్‌చౌదరి, కాంతమ్మ, శంకర్‌నాయక్, చిదంబర్రావు, రమేశ్, హేమమాలిని, సరిరాంనాయక్, కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి..
టేకులపల్లి, అక్టోబర్ 9: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ స్పష్టంచేశారు. టేకులపల్లి మండలంలో సోమవారం పర్యటించిన ఆమె.. దాస్తండా పంచాయతీ నూతన కార్యాలయాన్ని సర్పంచ్ ప్రియాంకతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బాలకృష్ణ, రాజేశ్, వరప్రసాద్‌గౌడ్, బాలునాయక్, సత్యనారాయణ, రామానాయక్, తావుర్యానాయక్, నరేశ్, పోలి, బుజ్జి, సుమలత, కౌసల్య, సేవ్యా, గంగా, మోహన్, లక్ష్మానాయక్, రూప్సింగ్, పూల్సింగ్నాయక్, కార్యదర్శి శరత్ పాల్గొన్నారు.