Singareni | రామవరం, ఆగస్టు 22 : సింగరేణి సంస్థ అందిస్తున్న సోలార్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ లను తీసుకొని ఎక్కడ వాటి అవసరత ఉన్న ప్రదేశాలలో అమర్చుకొవాలి అని డైరెక్టర్ (పి&పి) కే. వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారంకొత్తగూడెం ఏరియాలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో బాగంగా పాలవాగు, గడ్డిగుట్ట, జగ్గారం, మర్రిగూడెం గ్రామాలలో నివాసం ఉంటున్న గుత్తి కోయ తెగకు చెందిన ప్రజలు సోలార్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిదిగా డైరెక్టర్ (పి&పి) కే. వెంకటేశ్వర్లు గ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్నికి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.కార్పొరేట్ సామాజిక బాధ్యతలో బాగంగా ఇలాంటి కార్యక్రమాలను సింగరేణి సంస్థ అందించడంలో ముందుంటుందని ఆయన అన్నారు.
కొత్తగూడెం ఏరియా జిఎం మాట్లాడుతూ కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివ రావు అభ్యర్ధన మేరకు సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం, ఆదేశానుసారం డైరెక్టర్ (పి&పి) సహకారంతో ఈ రోజు 12 సోలార్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ పంపిణీ కార్యక్రమమును నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిదిగా విచ్చేసిన డైరెక్టర్ (పి&పి) కే. వెంకటేశ్వర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే 2 టౌన్ సిఐ డి. ప్రతాప్ ప్రత్యేక చొరవతో ఈ నాలుగు గ్రామాలకు సోలార్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ పంపిణీ చేయడం జరిగినది వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు నూతనంగా అనుమతులు వచ్చిన వీకే కోల్ మైన్ సైట్ను సంబంధిత అధికారులతో పర్యవేక్షించారు .
ఈ కార్యక్రమానికి జిఎం తో పాటు కొత్తగూడెం ఏరియా ఏఐటియూసి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రెటరీ జే.గట్టయ్య, ఐఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, ఎస్ఓటు జిఎం జీ.వి.కోటిరెడ్డి, ఏజీఎం (ఫైనాన్స్) కే. హన సుమలత, డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు జిఎం కార్యాలయంలోని వివిద విబాగల అధిపతులు ఇతర అధికారులు , సిబ్బంది యూనియన్ ప్రతినిధులు మరియు కొత్తగూడెం చుట్టుపక్కల గ్రామాల అయినా పాలవాగు, గడ్డిగుట్ట, జగ్గారం మరియు మర్రిగూడెం లు పాల్గొన్నారు.