రఘునాథపాలెం, జూలై 18 : ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. ఖమ్మంలోని మదన్‌లాల్ స్వగృహానికి చేరుకున్న కేటీఆర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మదన్‌లాల్ సతీమణిని ఓదార్చిన కేటీఆర్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కేటీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు చంద్రావతి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కొండబాల కోటేశ్వరరావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.