కొత్తగూడెం అర్బన్/ మధిర/ వైరా టౌన్, జనవరి 31: ఐదేళ్ల కాలంలో కొత్తగూడెం, మధిర, వైరా మున్సిపాలిటీల అభివృద్ధికి గత కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేసిందని, ఆ అభివృద్ధే ఇప్పుడు కళ్లముందు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు.
ఇటీవల పదవీకాలం ముగిసిన కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లతా జయాకర్, వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు-విజయలక్ష్మి దంపతులను హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు శుక్రవారం సత్కరించారు.
Municipal Authorities 2
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో అంతర్గత రోడ్లు, డివైడర్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించామని గుర్తుచేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతిపక్షపాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.