ఖమ్మం, సెప్టెంబర్ 17 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడుతున్నారని, నిన్నటివరకు కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్‌గాంధీని ముద్దపప్పు అని తిట్టిన రేవంత్ ఢిల్లీ పెద్దల మెప్పు కోసం హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అన్నారు. హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహావిషరణను వ్యతిరేకరిస్తూ.. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఖమ్మం నగరంలో పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ సర్కిల్లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పగడాల నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ తల్లిని అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరానికి ప్రతీకగా నిర్మించిన సచివాలయంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల మండిపడ్డారు.
వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నాయకుల విగ్రహాలను సచివాలయం వేదికగా తెలంగాణ తల్లిని అవహేళన చేస్తూ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్‌రెడ్డి నిర్ణయాలు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వని రేవంత్‌రెడ్డి నాడు ఉద్యమకారులపై తుపాకిని ఎకిపెట్టిన సంఘటనను గుర్తుచేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని కాంగ్రెస్ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసినప్పటికీ, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్‌కి తరలించడం ఖాయమని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుండాల కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బి.రెడ్డి నాగచంద్రారెడ్డి, కార్పొరేటర్లు మోతరపు శ్రావణి సుధాకర్, కూరాకుల వలరాజు, దండా జ్యోతిరెడ్డి, మాటేటి అరుణనాగేశ్వరరావు, తోట ఉమారాణివీరభద్రం, మాజీ కార్పొరేటర్ మచ్చ నరేందర్, ఉద్యమకారులు శేషు, బొమ్మెర రామ్మూర్తి, పగడాల నరేందర్, గొల్లపూడి హరి, నగర ప్రచార కార్యదర్శి షకీన, ఊబ్బలపల్లి నిరోషా, అబ్బాస్, 21వ డివిజన్ ఇన్చార్జి ఉస్మాన్, మాటేటి రామారావు, పొదిల నాగరాజు, మందడపు కృష్ణారావు, గోగుల వీరయ్య, గండ్రు రవి, తుమ్మలపల్లి కోటి, ఆవుల లక్ష్మీనారాయణ, మొర్రిమేకల కోటయ్య, దానయ్య, పారా ఉదయ్, మాటేటి కిరణ్, ఎస్టీ సెల్ నగర అధ్యక్షుడు సురేష్, 10వ డివిజన్ అధ్యక్షుడు పాషా, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, ముజాహిద్, తోడేటి లింగరాజు, ఎస్సీ సెల్ నాయకులు ఎచ్చు ప్రసాద్, ఆరెంపుల వీరభద్రం, నెమలి కిషోర్, మాతంగి అనిల్, కోడిరెకల ఫ్రాన్సిస్, వీరేందర్, చంద్రకాని శ్రీనివాస్, చిలుమూరు కోటి, సత్యనారాయణరెడ్డి, రాజు, మల్లేశం, ఉదయ్, సురేష్, శ్రీనివాస్, శ్రీను, ఉపేందర్, సాయి, కిషోర్, వెంకట్, తిరుమల్, విజయ్ భవాని, నాగరాజు, కేసీఆర్ టవర్స్ శివ, శైలజ, నగేష్, మాధవి, రామారావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.