– ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
కారేపల్లి, జనవరి 31 : ప్రజా సమస్యల కోసం అనునిత్యం పరితపించే గొప్ప నాయకుడు దాచేపల్లి కృష్ణారెడ్డి అకాల మరణం బాధాకరమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు సూదన్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోని గాదేపాడు గ్రామంలో శనివారం దాచేపల్లి కృష్ణారెడ్డి సంతాప సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఈ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నా అంటూ పెద్దదిక్కుగా వ్యవహరించే కృష్ణారెడ్డి గుండెపోటుతో మృతి చెందడం విచారకరమన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే కృష్ణారెడ్డి మన మధ్యలో లేకపోవడం తీరని లోటన్నారు. అంతకుముందు దాచేపల్లి కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సంతాప సభలో వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మాజీ జడ్పీటీసిలు ఉన్నం వీరేందర్, వాంకుడోత్ జగన్, వివిధ పార్టీల నాయకులు నున్న నాగేశ్వరరావు, పి.సోమయ్య, బానోత్ దేవులా నాయక్, ముత్యాల వెంకట అప్పారావు, కొండబోయిన నాగేశ్వరరావు, కే.నరేంద్ర, అడ్డగోడ ఐలయ్య, దారావత్ మంగీలాల్, హనుమకొండ రమేష్ పాల్గొన్నారు.