Land Encroachments | ఖమ్మం రూరల్ : ప్రభుత్వ భూములను తమ వెంచర్లలో కలుపుకొని సొమ్ము చేసుకుంటున్న రియల్టర్లపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండల రెవెన్యూ అధికారులు అన్యాక్రాంతమైన డొంకలను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకునే పనిపై దృష్టి సారించారు.
అందులో భాగంగానే ఇవాళ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు సత్య సంకల్ప వెంచర్లో గుర్రాలపాడు సర్వే నెం 51,52లకు మధ్యలో గల నక్ష రెవెన్యూ డొంక వెంచర్లో కబ్జాకు గురి అయిన భూములపైన వచ్చిన ఫిర్యాదుల మేరకు సర్వే నిర్వహించి వెంచర్లో నుండి డొంకను పునరుద్ధరించారు.
దాదాపుగా 10 గుంటల ప్రభుత్వ డొంకను పునరుద్ధరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ ప్లాన్స్ తహసీల్దార్ పీ రాం ప్రసాద్, ఆర్ఐ ప్రసాద్‌తో ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
KCR | ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే!