దేశంలో అగ్రగామిగా తెలంగాణ
- అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఖమ్మం ఎంపీ నామా
- కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి 30 కుటుంబాలు
ఎర్రుపాలెం, మే 5: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. మండలంలోని రాజులదేవరపాడులో పీఎంజీఎస్‌వై కింద మంజూరైన రూ.521.46 లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణం, రూ.1,055.76 లక్షలతో చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్సీ తాతా మధు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు చావా రామకృష్ణ, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, దేవరకొండ శిరీష, శీలం కవిత, పంబి సాంబశివరావు, యరమల భాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, యరమల రేణుక, సూరానేని రామకోటేశ్వరరావు, శీలం జయలక్ష్మి, ప్రవళ్లిక, వేమిరెడ్డి బాలరాఘవరెడ్డి, యన్నం శ్రీనివాసరెడ్డి, ఉమామహేశ్వరి, మూల్పూరి శ్రీనివాసరావు, సాంబశివరావు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి 30 కుటుంబాలు..
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. మండలంలోని ఇనగాలి గ్రామంలో గురువారం కాంగ్రెస్ నుంచి 30 కుటుంబాల వారు టీఆర్ఎస్లో చేరారు. ఈ సంద్భంగా వారందరికీ ఎంపీ నామా నాగేశ్వరరావు గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఇనగాలి, బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో నామా ముత్తయ్య ట్రస్టు నుంచి మంజూరైన బోర్లను ప్రారంభించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

