మామిళ్లగూడెం, ఫిబ్రవరి 17: ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ల శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాల్లోను సిద్ధం చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఐజీ తరుణ్‌జోషి సూచించారు. వాటిల్లో అన్ని సదుపాయాలనూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాల వారీగా పోలీసు హెడ్క్వార్టర్లలో అందుబాటులో ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాల స్థితిగతులపై అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో హైదరాబాద్ నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
శిక్షణ తరగతుల కోసం ఇండోర్, అవుట్ డోర్ సౌకర్యాలు, బెడ్లు, జనరేటర్లు, కంప్యూటర్ ల్యాబ్, మరుగుదొడ్లు, వంటశాల తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పోలీసు అధికారులు చొరవ తీసుకొవాలని సూచించారు. ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో అందుబాటులో ఉన్న సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలోని సదుపాయాలపై సీపీ విష్ణు వివరించారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, సీటీసీ వైస్ ప్రిన్సిపాల్ వెంకటస్వామి పాల్గొన్నారు.