అభివృద్ధి చేశాను.. ఆశీర్వదించండి
ఖమ్మంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను.. ఆశీర్వదించి ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు రావడం సహజమని,
- అభివృద్ధి ఇంటి ముందు.. అజయ్ మీ కళ్ల ముందు ఉన్నాడు
- మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎన్నుకోండి
- పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం, నవంబర్ 29: ఖమ్మంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను.. ఆశీర్వదించి ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు రావడం సహజమని, నేను ఈ ఎన్నికల్లో నా ప్రచారం మొత్తం నేను చేసిన అభివృద్ధి నాతో ప్రజలకు ప్రజలలో నాకు ఉన్న అనుబంధం మీకు తెలుసునని పేర్కొన్నారు. నేను ప్రజలకు కరోనా కష్టకాలంలో కావచ్చు, వరదల సమయంలో కావచ్చు ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు చావుకు తెగించి, కుటుంబ సభ్యులు వారించినా వినకుండా, నాకు కుటుంబం పదవుల కంటే ఖమ్మం ప్రజలే ముఖ్యమని పని చేసిన విషయం మీకు తెలుసునని అన్నారు. నేను ఈ పది సంవత్సరాల్లో ఎకువ సమయం గడిపింది ఖమ్మం ప్రజలతోనేనని, నా కుటుంబం అయిన ఖమ్మం ప్రజలతో ఎంత మమేకమైపోయిందో మీ అందరూ గుర్తించాలన్నారు. ప్రతిరోజు మా ఇంటికి వందలాది మంది వివిధ పనుల నిమిత్తం వస్తూ ఉంటారు, వచ్చిన ప్రతి ఒకరికీ పనులు చేసి పెట్టిన, కేసీఅర్ నాకు కల్పించిన పదవిని ప్రజల కోసం ఉపయోగించినానని, పనులు చేసుకున్న వారికి పకన ఉన్నవారికి అందరికీ తెలిసిన విషయమేనని తెలిపారు.
ఎంతోమంది పేద ప్రజలకు ఉచిత వైద్యం మా మమతా సంస్థల ద్వారా అందిస్తున్నాను, చిన్న పాన్ డబ్బా ప్రారంభించాలని నన్ను పిలిచినా నేను మంత్రిని అనే అహంకారం లేకుండా వెళ్లి అది ప్రారంభించి వాళ్లకు ఆశీస్సులు అందించి వచ్చాను. ఏ ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా అన్నా నువ్వు రావాలి అని ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్లి ఆతిథ్యం స్వీకరించి ఆ కుటుంబంతో మమేకమైన మనస్తత్వం నాది అన్నారు.. నేను ఇకడ పుట్టి పెరిగి. ఇకడ చదువుకున్నవాడిగా ఖమ్మం అభివృద్ధి గుమ్మంగా మార్చాలని కలలు కన్నానని, ఆ కలలు సహకారం చేసుకునే విధంగా కష్టపడి పనిచేశానే తప్ప నేను ఎటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం నా పదవిని, నా పలుకుబడిని కానీ వాడలేదని, కానీ మిత్రులారా ఎన్నికల ప్రచారంలో తుమ్మల నాగేశ్వరరావు లాంటి పెద్దమనిషి నా ప్రత్యర్థిగా ఉన్నాడు. ఏ మాత్రం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ నన్ను తీవ్రమైన మనోవేదనకు గురి చేసే ప్రయత్నం చేశారు. నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నా ధర్మబద్ధంగా యుద్ధం చేద్దాం.. ప్రజల ఆశీర్వాదం ఎవరికి ఉంటే వాళ్ళం గెలుస్తాం. కానీ ఆ పెద్దమనిషి మొదటి నుంచి నాపై అధర్మ యుద్ధమే చేస్తున్నాడు.
నన్ను ఒకడిని ఓడించడం కోసం అనేక దుష్ట శక్తులను వాడుతున్నాడు. ఎటు పోయిన ప్రజల యొక మద్దతు లేని కారణంగా నన్ను దూషించడం, వ్యక్తిగత ఆరొపణలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు.. నా మీద అనేక కుట్రలకు తెగబడ్డారు నా నామినేషన్‌ను తిరసరించాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. యువకులు, విద్యార్థుల ఓట్లు తనకు పడవనే కక్షపూరిత వైఖరితో ఆ ఓట్లను తొలగించాలంటూ విద్యార్థులకు యువకులకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. ఈ రోజు ప్రచారంలో జరుగుతున్న అత్యంత దురదృష్టకరమైన ఘటనలు చూస్తున్నామని అన్నారు.. నా పేరుతో ఉన్న మరొక స్వతంత్ర అభ్యర్థిని పొటీ చేయించి నా గొంతుతో వాయిస్ కాల్స్ పెట్టించి ప్రజలలో గుర్తు కన్ఫ్యూజ్ అయ్యేలా ప్రయత్నం చేశారన్నారు. దుర్మార్గపు అధర్మంపై నేను ధర్మంగానే పోరాడుతాను. నేను ప్రజలను మాత్రమే నమ్ముకున్నా.. వారి ఆశీస్సులే నన్ను గెలిపిస్తాయని, విజ్ఞులైన ఖమ్మం ప్రజల ఆలోచించాలని, ఈ దుర్మార్గాలను కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా ఓటు వేసి మీరు ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తున్నానని పువ్వాడ అజయ్ ప్రజలను కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

