కూసుమంచి, మార్చి 8 : మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్‌లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాలేరులో జీవన జ్యోతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్ చేశారు. కూసుమంచి మండలంలోని గైగొళ్లపల్లి, జక్కేపల్లి, ఈశ్వరమాదారం, పెరికసింగారం గ్రామాల్లో అఖిల భారత సర్వీసుల శిక్షణ అధికారుల సమక్షంలో డ్వాక్రా, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు మహిళలు కేక్ కట్ చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని టీవీసీ ఫంక్షన్హోల్లో ఎంపీపీ బెల్లం ఉమా వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన వేడులకు నియోజకవర్గంలోని రూరల్, కూసుమంచి, తిరుమలయపాలెం, నేలకొండపల్లి మండలాలకు చెందిన మహిళలు వేలాదిగా తరలివచ్చారు. ఇటీవల నిర్వహిచిన ఆటల పోటీల్లో విజేతలైన మహిళలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. అనంతరం మహిళతో కలిసి ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు సహపంక్తి భోజనం చేశారు. తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో సర్పంచ్ రామసహాయం హరితరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆశా వర్కర్లు తిమ్మిడి సైదమ్మ, గొర్రెపాటి సుకన్యలను సన్మానించారు. నేలకొండపల్లి మండలంలోని కొత్తకొతూరులో టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మండల మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్యేకు మొక్క అందించారు. అనంతరం కేక్‌ను కట్ చేసి మహిళలకు అందించారు. మధిర మండలం, పట్టణ టీఆర్ఎస్ మహిళా కమిటీల ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లతజయాకర్ అధ్యక్షతన జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సీడ్సీ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాలను వివరించారు.
పార్టీలకు అతీతంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామన్నారు. మధిరరూరల్ మండలంలోని సైదల్లిపురం, మాటూరు(హెచ్‌డబ్ల్యూ) ప్రాథమిక పాఠశాల, పలు గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. బోనకల్ మండలంలోని నారాయణపురంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షుడు కరివేద సుధాకర్‌రావు అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో లింగాల కమల్‌రాజు, కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. రావినూతల గ్రామానికి చెందిన గోల్డ్ మెడల్ సాధించిన చేబ్రోలు సిరిను ఘనంగా సన్మానించారు. ముష్టికుంట్ల, బ్రాహ్మణపల్లి, బోనకల్లు గ్రామాల్లో వేడుకలు చేశారు. చింతకాని మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య ఆధ్వర్యంలో స్థానిక రైతువేదికలో వేడుకలో నిర్వహించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, వైద్యసిబ్బందిని శాలువా బోకేలతో సన్మానించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని రైతువేదికలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు ఆధ్వర్యంలో ఎంపీపీ దేవరకొండ శిరీష అధ్యక్షతన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని రంగాలకు చెందిన మహిళలను శాలువాలతో సత్కరించారు. ముదిగొండ మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్లో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్మన్ కమల్‌రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన మహిళలను ఆయన సన్మానించారు. జిల్లా కోపరేటీవ్ అధికారి విజయకుమారిని ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండ స్వామి సన్మానించారు. ఖమ్మంలోని ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.