సత్తుపల్లి రూరల్, సెప్టెంబర్ 20 : నిరుపేదలు లేని బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం సత్తుపల్లి మండలం రేగళ్లపాడు, యాతాలకుంట, చెరుకుపల్లి గ్రామాల్లో ఆసరా గుర్తింపుకార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సండ్రకు ఆయా గ్రామాల ప్రజలు బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, గతంలో గిరిజనులను పట్టించుకున్న నాధుడులేడని, గిరిజనుల రిజర్వేషన్లను 10శాతానికి పెంచి గిరిజన బాంధవుడిగా కేసీఆర్ మారారని అన్నారు. దళితబంధు మాదిరిగా గిరిజనులకు గిరిజనబంధు అమలుచేస్తానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో పలు పథకాలు అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో వీరేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎంపీపీ దొడ్డా హైమావతి, మున్సిపల్ చైర్మన్ మహేశ్, ఆత్మ చైర్మన్ హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ రామారావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సత్యం, సొసైటీ అధ్యక్షుడు కృష్ణయ్య, సర్పంచ్‌లు విజయ, లలిత, మోహనరావు, ఎంపీటీసీ కృష్ణారావు, టీఆర్ఎస్ నాయకులు బొడ్డు బ్రదర్స్, కృష్ణ, శంకర్రావు, పుల్లారావు, రాంప్రసాద్, రవి, మారేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, చాంద్‌పాషా, వీరభద్రం, ఆర్ఐ నరేశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.