కూసుమంచి/ఎర్రుపాలెం/మధిర రూరల్/ వైరా రూరల్/కారేపల్లి/ సత్తుపల్లి రూరల్/ రఘునాథపాలెం, ఆగస్టు 22: రఘునాథపాలెం మండలంలోని కోయచలక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థి జునైద్, సత్తుపల్లి మండలంలోని సదాశివునిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బల్లా హర్షిత, కారేపల్లి మోడల్ స్కూల్కు చెందిన ముగ్గురు విద్యార్థులు, కొత్త కమలాపురానికి చెందిన ఎం.ధనవంతు చౌదరి, కారేపల్లికి చెందిన జి.చరణ్సాయి, పేరుపల్లికి చెందిన కె.సాహిత్రెడ్డి, గొల్లపూడి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన షేక్ చాందిని, మధిర మండలంలోని దెందుకూరు జడ్పీహెచ్ఎస్కు చెందిన పగిడిపల్లి రాజేశ్, ఎర్రుపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన యరమల మహేశ్వరరెడ్డి, చింతకాని ఉన్నత పాఠశాలకు చెందిన కొడవటిగంటి సుస్మిత, కూసుమంచిలోని ఉన్నత పాఠశాలకు చెందిన భూపతి, మోహన్ బాసరలో ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. విద్యార్థులను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.