భద్రాచలం, జూలై 17: ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగింది.. గడిచిన ఐదు దశాబ్దాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో మహోగ్ర రూపం దాల్చింది.. జన జీవితాలను అతలాకుతలం చేసింది.. భద్రాద్రి ఏజెన్సీని స్తంభింపజేసింది.. పొలాలను ముంచేసింది.. గ్రామగ్రామాలకు ఖాళీ చేయించింది.. వేలాది మందిని నిరాశ్రయులను చేసింది.. వారిని పరామర్శించి వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపేంచేందుకు ఆదివారం దక్షిణ అయోధ్యాపురి భద్రాద్రికి విచ్చేశారు..
గోదారమ్మ శాంతించాలని పసుపు కుంకుమ సమర్పించారు.. నదీ మాతకు నమస్కరించారు.. అనంతరం పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారిని పరామర్శించారు.. ‘ఎవరూ ఆందోళన చెందవద్దు.. మీకు నేనున్నాను’ అని భరోసా కల్పించారు.. యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అండగా ఉంటారని, వరదలు తగ్గే వరకు కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు.. మొత్తం 7,274 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున నగదు, 20 కిలోల చొప్పున బియ్యాన్ని తక్షణ సాయంగా అందిస్తామని ప్రకటించారు.