ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 11: జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్‌లో జిల్లాలోని ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఆలిండియా స్థాయిలో సత్తా చాటారు. జూన్ 23 నుంచి 29 వరకు జాతీయ స్థాయిలో జరిగిన మెయిన్స్ రాత పరీక్షకు జిల్లాలో మూడు కేంద్రాల నుంచి 5,210 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 300 మార్కులకు ఈ పరీక్షను నిర్వహించారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యధిక పర్సంటైల్ సాధించారు.
న్యూవిజన్ జయకేతనం..
జేఈఈ మెయిన్స్‌లో నగరంలోని న్యూవిజన్ కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని కళాశాల చైర్మన్ సీహెచ్‌జీకే ప్రసాద్ తెలిపారు. కళాశాలకు చెందిన కే.వైభవ్ చౌదరి-99.97 పర్సంటైల్‌తోపాటు 17 మంది విద్యార్థులు 99 పర్సంటైల్పైగా సాధించినట్లు వివరించారు. అభ్యుదయ్ 99.82, కౌషిక్ 99.81, సాయి అమృత వర్షిణి 99.80, వెంకట నిరంజన్ 99.65, శ్రీదుర్గ 99.65, సాయి చిన్నయి 99.65, మారంక్ 99.64, సాయి అభిషేక్ 99.59 పర్సంటైల్‌తో రాణించినట్లు చెప్పారు. ఉత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ గోపిచంద్, అకడమిక్ డైరెక్టర్ కార్తీక్, ప్రిన్సిపాల్ బ్రహ్మాచారి, శ్రీనివాసరావు అభినందించారు.
శ్రీచైతన్య..
జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్ సాధించారని కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య తెలిపారు. కళాశాలకు చెందిన అక్షిత 99.91, హరిచందన 99.85, విశ్వనాథ్ 99.83, ఈశ్వర్ సాయి గణేశ్ 99.73, సుహన 99.71, వరుణ్‌కుమార్ 99.70, దుర్గ సాయి మహేశ్ 99.60, ధనలక్ష్మి 99.59, వివేక్హృదయ్ 99.50, కృష్ణసాత్విక్ 99.34, ముకేశ్ 99.06 పర్సంటైల్ సాధించినట్లు వివరించారు. 99 పర్సంటైల్ పైగా 11 మంది, 90 పర్సంటైల్ పైగా 96 మంది సాధించినట్లు చెప్పారు. విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ సాయిగీతిక, అధ్యాపకులు అభినందించారు.
కృష్ణవేణి…
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నగరంలోని కృష్ణవేణి కళాశాల విద్యార్థులు సత్తా చాటారని కళాశాల అధినేత యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. కళాశాలకు చెందిన శ్రీ విష్ణు వరుణ్ 99.32, శ్రీనివాస్ 96.78, అఖిల్ సాయి 96.07, అరుణ్ 94.4, మహేశ్ 94.3, వెంకటసాయిరాం 93.76 పర్సంటైల్‌తో రాణించినట్లు వివరించారు. విద్యార్థులను కళాశాల డైరెక్టర్స్ గొల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ గుర్రం రాంచందర్‌రావు, అధ్యాపకులు అభినందించారు.
హార్వెస్ట్..
జేఈఈ మెయిన్స్‌లో హార్వెస్ట్ విద్యార్థులు ఉన్నత స్థాయి పర్సంటైల్స్ సాధించారని విద్యాసంస్థల అధిపతి పోపూరి రవిమారుత్ తెలిపారు. కళాశాలకు చెందిన ధనుంజయ్ 99.96, అన్షితారెడ్డి 99.44, చక్రధర్‌రెడ్డి 98.89, తనుశ్రెడ్డి 98.18, హేమంత్ 97.84, సరయు 97.36 పర్సంటైల్‌తో రాణించినట్లు వివరించారు. 179 మంది విద్యార్థులు హాజరుకాగా 17 మందికి 90 శాతం పర్సంటైల్స్, 60 మంది ఉత్తమ పర్సంటైల్ సాధించినట్లు చెప్పారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి, అధ్యాపకులు అభినందించారు.
రెజోనెన్స్..
జేఈఈ మెయిన్స్‌లో నగరంలోని రెజోనెన్స్ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ పర్సంటైల్ సాధించారని కళాశాల డైరెక్టర్స్ రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్‌రావు తెలిపారు. కళాశాలకు చెందిన జయసాయి 99.38, దీక్షిత్‌రెడ్డి 99.11, రుత్విక 98.59, కౌటిల్య 98.07, సుప్రజ 95.10, అఖిల్ 93.62 పర్సంటైల్ సాధించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్లు వివరించారు. విద్యార్థులను ప్రిన్సిపాళ్లు సతీశ్, భాస్కర్‌రెడ్డి, శాంతి, అధ్యాపకులు అభినందించారు.