చండ్రుగొండ, జూలై 7: అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. చండ్రుగొండ మండలంలో గురువారం పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. చండ్రుగొండ, మద్దుకూరు గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. 10 మంది లబ్ధిదారుకులకు దళితబంధు యూనిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
బాధిత కుటుంబాలను టీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తొలుత టేకులబంజరలో మాజీ ఎంపీపీ బాలునాయక్ కుటుంబ సభ్యులను, రేపల్లెవాడలో నడిపి కృష్ణ కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు. చండ్రుగొండకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు చీదెళ్ల పవన్‌కుమార్ మాతృమూర్తి చీదెళ్ల ధనలక్ష్మికి నివాలర్పించారు. చండ్రుగొండలో ధరణి సమస్యతో నిలిచిపోయిన పట్టాదారు పాసుపుస్తకాల సమస్యలను, భూముల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇంకా వివిధ సమస్యపలై పలువురు ప్రజలు, నాయకులు ఆయనకు వినతిపత్రాలు సమర్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు బానోత్ పార్వతి, దారా బాబు, ఉప్పతల ఏడుకొండలు, సయ్యద్ రసూల్, పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, చీదెళ్ల పవన్‌కుమార్, బానోత్ రాముడు, నల్లమోతు వెంకటనారాయణ, మేడా మోహన్‌రావు, భూపతి రమేశ్, మద్దిరాల చిన్నపిచ్చయ్య, ఉన్నం నాగరాజు, సత్తి నాగేశ్వరరావు, భూపతి శ్రీనివాసరావు, లంకా విజయలక్ష్మి, మార్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.