కూసుమంచి రూరల్, జూన్ 14: పశువైద్య సిబ్బంది రైతులు, జీవాల పెంపకందారులకు అండగా ఉండాలని పశుసంవర్ధకశాఖ ఏడీ భాను ఆదేశించారు. ముత్యాలగూడెం, మల్లేపల్లి, గోరీలపాడుతండా పంచాయతీల్లో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ మంగళవారం పరిశీలించి మాట్లాడారు. ముత్యాలగూడెంలో జీవాలకు నట్టల నివారణ మందు వేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, ముత్యాలగూడెం, మల్లేపల్లి, గోరీలపాడుతండా సర్పంచ్‌లు బొల్లికొండ శ్రీనివాస్, పొట్టిపింజర నాగేశ్వరరావు, బానోత్ సరస్వతి, ఎంపీటీసీలు ఊడుగు జ్యోతి, కందుల వెంకటనారాయణ, సిబ్బంది వరలక్ష్మి, రవికృష్ణ, శ్రీనివాస్‌రావు, మాధవ్, నిజాంబీ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ నాయకుల నివాళి
ఎర్రుపాలెం, జూన్14 : మామునూరు గ్రామానికి చెందిన మారాబత్తుల వెంకటేశ్వర్లు తల్లి పుల్లమ్మ భౌతికకాయాన్ని టీఆర్ఎస్ నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మధిర ఏఎంసీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి సాంబశివరావు, వెంకటేశ్వర్లు, గొల్లపూడి యాకోబు, లక్ష్మయ్య, బుర్ర నారాయణ, వెంకన్న, పురుషోత్తం, బాలరాజు పాల్గొన్నారు.