రఘునాథపాలెం, మార్చి 25: స్త్రీలలో రక్తం లోపించకుండా చూడాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణకుమారి అంగన్వాడీ టీచర్లకు సూచించారు. రఘునాథపాలెం రైతువేదికలో అంగన్వాడీ టీచర్లకు ఐసీడీఎస్ ద్వారా చేపట్టే కార్యక్రమాలపై శుక్రవారం అవగాహన కల్పించారు. స్త్రీలు రక్తహీనతకు గురవడానికి కారణాలు, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. అంతేగాక ఆరేళ్లలోపు చిన్నారులకు తప్పక తల్లి పాలు పట్టించాలని సూచించారు. ఈ సందర్భంగా తల్లి పాల ప్రాముఖ్యత అర్థమయ్యే రీతిలో చిన్నారుల తల్లులకు తెలియజేయాలని వివరించారు. ఈ సందర్భంగా 21 అంశాలపై వారికి ఆయా సెక్టార్ల సూపర్వైజర్లు మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల సూపర్వైజర్లకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో షేక్ పర్వీన్, షేక్ నజీమా, మూడు సెక్టార్ల పరిధిలోని అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.