ఖమ్మం, మార్చి 24: సామాన్యులపై భారాన్ని మోపేలా కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న ధరలతో పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంత్రి అజయ్‌కుమార్ ఆదేశాలతో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి గురువారం ఖమ్మంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్ భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దాన్ని దహనం చేశారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లను భుజాలపై ఎత్తుకుంటూ, ఆటోను తాడుతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మంత్రి పీఏ రవికిరణ్ మాట్లాడుతూ కేంద్రం పెంచిన ధరలతో సామాన్యుడు బతికే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశంలో నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు లక్ష్మీప్రసన్న, ఫాతిమా, ఖమర్, ఇసాక్, వీరునాయక్, ఆర్జేసీ కృష్ణ, లింగాల రవికుమార్, కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, రాపర్తి శరత్, కన్నం వైష్ణవి, పగడాల శ్రీవిద్య, గజ్జల లక్ష్మి, పసుమర్తి రామ్మోహన్, గోళ్ల చంద్రకళ, షౌకత్ అలీ, సరస్వతి, తోట వీరభద్రం, ప్రసన్నకృష్ణ, కుర్రా భాస్కర్‌రావు, మందడపు నర్సింహారావు, దేవభక్తిని కిశోర్, రమేశ్‌గౌడ్, కొల్లు పద్మ, పాల్వంచ కృష్ణ, లక్ష్మయ్య, షకీనా, తాజుద్దీన్, మాటేటి కిరణ్‌కుమార్, మురళీకృష్ణ పాల్గొన్నారు.