కూసుమంచి, ఏప్రిల్ 7: ఎద్దుల పోటీలు మన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకలని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని జీళ్లచెరువులో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎద్దుల పోటీల్లో గురువారం ఆయన మాట్లాడారు. మనకు మాత్రమే ప్రత్యేకమైన ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి వెంకటరెడ్డి పేరుమీద లింగాలలో వెంటర్నరీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ నాలుగు రోజులు జరిగే ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ తాతా మధు, సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కేఎంసీ చైర్మన్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మద్దులపల్లి ఏఎంసీ చైర్మన్ మల్లిడి అరుణ, జడ్పీటీసీలు ఇంటూరి బేబీ శేఖర్, వరప్రసాద్, ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వేముల వీరయ్య, బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య, పాషబోయిన వీరన్న, కొండా సత్యం, ఉమ, బొడ్డు నరేందర్, చెన్ను వెంకన్న పాల్గొన్నారు.